అమ్మో.. చలి
కరీంనగర్ టౌన్ ●:
జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 6 గంటలైందంటే చాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. పొగమంచుతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో 10 నుంచి 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ అసమతుల్యతతో ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల వంటి దీర్ఘకాల పేషెంట్లు చలిలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment