‘కోతిరాంపూర్ నుంచి ఎన్‌టీఆర్ చౌరస్తా మీదుగా సిరిసిల్ల బైపాస్ రోడ్డుకు వెళ్లాలంటే కుడి వైపు తిరగాలి.. ఆ సమయంలో లెక్కలేనన్ని వాహనాలు ఎదురుగా వస్తూ సిరిసిల్ల బైపాస్ నుంచి హైదరాబాద్ రోడ్డు వైపు వెళ్తుంటాయి. అటునుంచి సిరిసిల్ల బైపాస్‌కు వెళ్లే, వచ్చే వాహనాలు ఎదురెదురుగా వస్తుండటంతో వాహనదారులు ఎటువెళ్లాలో తెలియక వాహనాలు నిలిపేస్తుంటారు. ఫలితంగా ట్రాఫిక్ జాం అవుతుంది. కరీంనగర్‌లోకి ఈ ప్రాంతం గుండా వెళ్లే కొత్తవారు వాహనాలు ఎటు నుంచి ఎటు వెళ్తాయో తెలియక అయోమయానికి గురైన సందర్భాలు అనేకం. ఏళ్లుగా ఇదే సమస్య. ట్రాఫిక్ పోలీసులు ఇటీవల బారికేడ్లతో డివైడర్ ఏర్పాటు చేయడం వల్ల ఎవరిదారిలో వాళ్లు వెళ్తున్నారు. ఈ ఐడియాతో ట్రాఫిక్ జాం సమస్యను పోలీసులు పరిష్కరించారు.’
Comments
Please login to add a commentAdd a comment