సమతుల ఆహారం తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమతుల ఆహారం తీసుకోవాలి

Published Fri, Dec 20 2024 1:34 AM | Last Updated on Fri, Dec 20 2024 1:33 AM

సమతుల ఆహారం తీసుకోవాలి

సమతుల ఆహారం తీసుకోవాలి

● చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గి, సీజనల్‌, ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలుండే సమతుల ఆహారం, ప్రోబయోటిక్స్‌, ప్రీబయోటిక్స్‌ అధికంగా తీసుకోవాలి.

● పండ్లు, కూరగాయలు, బ్రోకలీ, చిలకడదుంప వంటివి ఎక్కువగా తినాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు నీరు, హెర్బల్‌ టీలు, వెచ్చని సూప్‌లు తీసుకోవాలి. తగినంత నిద్ర, వ్యాయామం, శారీరక శ్రమ మానసిక స్థితిని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

● వేరుశనగ, బాదాం, జీడిపప్పు, పిస్తా, ఖర్జురా వంటివి తీసుకోవాలి. ఇవి బలవర్ధక ఆహారం. శరీరంలో వేడిని పుట్టిస్తాయి. యాపిల్‌, అరటిపండ్లు, బొప్పాయి. పైనాపిల్‌ వంటివి తినాలి. వీటిలో ఫైబర్‌ ఉండి, వేడిని ఉత్పత్తి చేస్తాయి.

● కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్స్‌, స్వీట్లు, కేకులు, ఫ్రైడ్‌ రైస్‌, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.

– భవ్యశ్రీ, డైటీషియన్‌, అపోలో రీచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement