No Headline
కరీంనగర్‌టౌన్: తమను రాతపూర్వకంగా కాకుండా యథావిధిగా క్రమబద్ధీకరించాలని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అర్బన్ హెల్త్ సెంటర్ల ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను 24ఏళ్లుగా క్రమబద్ధీకరించకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. రాత పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 6,500 మంది ఏఎన్‌ఎంలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. లేకుంటే నిరవధిక సమ్మె చేస్తామన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ల ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు సంతోష, స్వరూప, రజిత, స్రవంతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment