కేటీఆర్‌పై అక్రమ కేసు సిగ్గుచేటు
● బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
కరీంనగర్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అసెంబ్లీలో ఎదుర్కొనే సత్తా లేక దొడ్డిదారిన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని కుట్రలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. నగరంలోని మీసేవ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. ఏడాదిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను అమలు చేయకుండా కొత్తకొత్త అంశాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని అబాసుపాలు చేయడానికే తహతహలాడుతోందని ఆరోపించారు. మచ్చలేని నాయకుడిగా నాలుగుసార్లు గెలుపొందిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై పొన్నం ప్రభాకర్ అవాకులు, చెవాకులు పేలడం తగదని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు ఓడిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. గంగుల కమలాకర్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment