కలెక్టర్ నివేదిక ప్రకారమే
వ్యవసాయం తగ్గి, పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ నివేదిక ప్రకారమే గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించాం. ఆనాటి ప్రభుత్వం ఆరెపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లిలను కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనం చేసి, పక్కనే ఉన్న బొమ్మకల్‌ను కలపలేదు. ఆనాడు అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ నివేదిక ఇచ్చారు. అదే తరహాలో ప్రస్తుతం కలెక్టర్ నివేదిక ప్రకారమే కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తున్నాం.
– అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి
ల్యాండ్ గ్రాబర్స్‌ను రక్షించడానికే
కరీంనగర్‌కు దూరంగా ఉండే మానకొండూర్ నియోజకవర్గంలోని సదాశివపల్లిని ఆనాటి ప్రభుత్వం కలిపింది. అలాగే, అల్గునూర్ దూరంగా ఉన్నప్పటికీ విలీనం చేశారు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం. ల్యాండ్ గ్రాబర్స్‌ను సీపీ జైలుకు పంపారు. వారందరినీ రక్షించడానికే కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనాన్ని అడ్డుకుంటున్నారు.
– అసెంబ్లీలో కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూర్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment