అపోలో రీచ్‌లో అరుదైన న్యూరో చికిత్స
కరీంనగర్‌టౌన్: అపోలో రీచ్ ఆస్పత్రిలో అరుదైన న్యూరో చికిత్సను విజయవంతంగా చేసినట్లు ఆస్పత్రి కార్డియాలజిస్ట్ కృష్ణచైతన్య, న్యూరో ఫిజీషియన్ హరికృష్ణ ఏన్నం, న్యూరో సర్జన్ సుబ్రాత్‌కుమార్ సోరన్ తెలిపారు. గురువారం ఆస్పత్రిలో వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన శంకర్ బ్రెయిన్‌లో రక్తనాళం క్లాట్‌తో ప్రమాదకర పరిస్థితుల్లో అపోలో రీచ్ ఆస్పత్రికి వచ్చాడన్నారు. అంజియోగ్రామ్ టెస్ట్ చేయగా 95శాతం మెదడు నరాల్లో బ్లాక్ ఉందన్నారు. వెంటనే తమ టీంతో కలిసి విజయవంతంగా బ్రెయిన్ నరానికి స్టంట్ వేశామన్నారు. తద్వారా శంకర్ సంపూర్ణగా కోలుకొని మరుసటి రోజే డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇలాంటి అరుదైన చికిత్స అపోలో రీచ్‌లో అందుబాటులో ఉందన్నారు. అపోలో రిచ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ నాగసతీశ్ కుమార్ పాల్గొన్నారు.
ఆరోగ్యహబ్‌కు రక్తదాతలే కీలకం
జగిత్యాల: క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్న ఆరోగ్యహబ్‌కు రక్తదాతలే కీలకమని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురువారెడ్డి అన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తం నిల్వ ఉంటే చాలామందికి ఉపయోగపడుతుందన్నారు. రక్తదాతలు లేక కొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని తెలిపారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్లు ఎన్నాకుల రాము, వేణుబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment