టీఎన్జీవో నూతన కార్యవర్గం
కరీంనగర్ అర్బన్: టీఎన్జీవో మండల, తాలుకా కార్యవర్గాల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. స్థానిక టీఎన్జీవో భవన్ వేదికగా ఎన్నికలు జరుగుతున్నాయి. సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కరీంనగర్ టౌన్ యూనిట్ అధ్యక్షుడిగా మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శిగా వెలిచాల సుమంత్ రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా పత్తెం శ్రీనివాస్, కోశాధికారిగా సల్వాజి తిరుమలరావు ఎన్నికయ్యారు. చొప్పదండి తాలూకా అధ్యక్షుడిగా కా మ సతీశ్, కార్యదర్శిగా గిరిధర్ రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా సత్యం, కోశాధికారిగా తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర, జిల్లా నేతలు నాగుల నరసింహస్వామి, రవీందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
కరీంనగర్‌టౌన్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. శనివా రం బుట్టిరాజారాంకాలనీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.ఓపీసేవలు, మందులు, ల్యాబ్‌పరీక్షలపై ఆరా తీశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఓపీడీ సేవలు అందించాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. గర్భిణీ సీ్త్రల నమోదు, వ్యాక్సినేషన్ 100శాతం అయ్యేలా చూడాలని తెలిపారు. ఐఎల్‌ఆర్ వ్యాక్సినేషన్ వాయిల్స్‌ని కోల్డ్‌చైన్ ఉష్ణోగ్రతలను తరచూగా చూసుకోవాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు.
ఒంటి కాలుపై నిలబడి నిరసన
కరీంనగర్: తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఒంటికాలుపై నిలబడి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. శనివారం నాటికి సమ్మె 19 రోజుకు చేరగా.. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వ్య వస్థాపక అధ్యక్షుడు రాజారామ్ యాదవ్, జేఎ న్టీయూహెచ్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ స్వామి వివేక్ పటేల్, బీసీ జర్నలిస్ట్ జేఏసీ జనరల్ సెక్రటరీ మేకల కృష్ణ యాదవ్, పోచమల్లు యాద వ్, కరీంనగర్ జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రఘువీర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు వంశీ, జిల్లా టీడీపీ నాయకుడు ఆగయ్య సంఘీభావం తెలిపారు. నాయకులు బెజ్జంకి ఆంజనేయులు, గుండా రాజిరెడ్డి, మ హేశ్, రమేశ్, రవిచంద్ర, శ్రీనివాస్ ఉన్నారు.
దుకాణాలు స్వాధీనం
కరీంనగర్ కార్పొరేషన్: లీజు ఒప్పందం ముగి సినా వదలకుండా ఉన్న వ్యాపారుల నుంచి నాలుగు దుకాణాలను నగరపాలకసంస్థ స్వా ధీన పరుచుకుంది. నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లో ఉన్న నగరపాలకసంస్థ దుకాణ సముదాయానికి సంబంధించి 30ఏళ్ల లీజు ఒప్పందం ఇటీవల ముగిసింది. మళ్లీ వేలం వేయగా, పలువురు వ్యాపారులు దుకా ణాలను అద్దె ప్రాతిపదికన దక్కించుకున్నారు. సముదాయంలోని 1, 6, 7, 9 దుకాణాల వ్యా పారులు 30ఏళ్లుగా ఉంటున్న తమకే అవకాశం ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఒప్పందం ముగిసినందున ఖాళీ చేయాల్సిందేనని చెప్పి కోర్టు నెల రోజుల గడువిచ్చింది. ఈ గడు వు ఈ నెల 24వ తేదీతో ముగియడంతో శనివారం నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగం అధికారులు, పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఖాళీ చేయించారు. బల్దియా షట్టర్లను స్వాధీ నం చేసుకుంది. ఈ నాలుగు షెట్టర్లను కొత్తగా లీజు పొందిన వాళ్లకు అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment