రేపటి కోసం.. మారుదాం
● నూతన నిర్ణయాల కోసం చేద్దాం.. చాలెంజ్ ● దురలవాట్లను దూరం కొడదాం
● మంచి మార్గానికి బాటలు వేద్దాం ● సరి‘కొత్త’గా ఏడాదిని ప్రారంభిద్దాం
ఎన్నో ఆనందాలు.. అనుభవాలు.. ఆలోచనలు.. విషాదాలు.. వివాదాలను చరిత్రలో కలిపేస్తూ.. 2024 ఏడాది ముగుస్తోంది. 2025 సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మద్యం మానేద్దామని, సిగరెట్ ఆపేద్దామని. కొత్త సంవత్సరం ప్రారంభంలో మూడు, నాలుగు రోజులపాటు నిష్టగా నియమాలను కొనసాగించినా మరేదో బలహీన క్షణంలోనో, స్నేహితులు మొహమాట పెట్టారనో, సాంఘిక మర్యాదలు పాటించకపోతే ఎలా అనో మనల్ని మనమే సర్దిచెప్పుకుని ఎప్పటిలాగే అవే అలవాట్లను పునఃప్రారంభిస్తాం. ఇదంతా చాలా మంది జీవితాల్లో సహజంగా జరిగేదే. అయితే, ఈ బలహీనతలే కాలం గడుస్తున్న కొద్దీ మార్చుకోలేని వ్యసనాలుగా మారిపోయి, మనల్ని, మన కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఈసారి తీసుకునే నిర్ణయాలను కచ్చితంగా అమలు చేసేందుకే కట్టుబడి ఉందాం. –సిరిసిల్ల కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment