సంక్రాంతిలోపు ఫీజు బకాయిలు చెల్లించాలి
కరీంనగర్‌టౌన్: వచ్చే సంక్రాంతి లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ మెత్తాన్ని చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహోద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ‘దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్’ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుని, ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను ఆదివారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సన్మానించారు. అభ్యర్థులను అభినందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమ త లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చిన ట్లు తెలిపారు. వారు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక కళాశాలల యాజమాన్యాలు నష్టపోయి, విద్యాసంస్థలు మూసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్లు సూపర్ ప్రధానిగా సోనియాగాంధీ కొనసాగుతూ రబ్బర్ స్టాంప్‌గా మార్చిందన్నారు.
బొమ్మకల్‌లో పర్యటన
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. బీరయ్య, మహంకాళీ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. కార్యకర్తలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. దళిత మోర్చా నాయకుడు గాలిపెల్లి నారా యణ ఇంట్లో శుభకార్యానికి హాజయ్యారు. బీజే పీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్, దాది సుధాకర్, సదానందం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్
తన కోచింగ్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు పొందినవారికి సన్మానం
Comments
Please login to add a commentAdd a comment