ఫుట్‌పాత్ ఆక్రమణలపై దృష్టి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణలతో నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాల్సిందేనన్నారు. ఫుట్‌పాత్‌లను ధ్వంసం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవనాన్ని సందర్శించారు. పనులు త్వరగా పూర్తి చేసి, ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment