కరీంనగర్: ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్(ఎఫ్‌పీఎస్‌టీ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అమిరిశెట్టి దామోదర్, జనరల్ సెక్రటరీగా వడ్నాల రామ్ కిరణ్, ట్రెజరర్‌గా బొద్దుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా శంకర్, శ్రీవాణి, భుజన్ చందర్, తిరుపతి, జాయింట్ సెక్రటరీలుగా రామానుజన్, దేవదాస్, లింగయ్య, ఝాన్సీ, అకడమిక్ కౌన్సిలర్‌గా ఓదెలు కుమార్ ఎన్నికయ్యారు. జిల్లా సైన్స్ అధికారి జయపాల్‌రెడ్డి మాట్లాడుతూ సైన్స్ ఉపాధ్యాయులందరూ ప్రయోగశాలను పూర్తిస్థాయిలో వినియోగించి విద్యార్థులలో శాసీ్త్రయ అవగాహన పెంచాలని, సైన్స్ వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment