వృద్ధులకు సౌకర్యాలు కల్పించాలి
కరీంనగర్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సె క్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేశ్ నగరంలోని ప్రభుత్వ వృద్ధుల, దివ్యాంగుల ఆశ్ర మం, స్వధార్‌హోంను సందర్శించారు. వృద్ధులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు, న్యాయపరమైన సేవలకు సంప్రదించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు.
లీజుకు మల్టీపర్పస్, జ్యోతిబాపూలే పార్క్‌లు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఆధునీకరించిన రెండు పార్క్‌ల నిర్వహణను లీజు ప్రాతిపదికన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నగరపాలకసంస్థ నిర్ణయించింది. స్మార్ట్‌సిటీలో భా గంగా తెలంగాణచౌక్ సమీపంలో మల్టీపర్పస్ పార్క్, జ్యోతిబాపూలే పార్క్‌ను ఆధునీకరించడం తెలిసిందే. మల్టీపర్పస్ పార్క్ పనులు దాదాపు పూర్తి కాగా, నిర్వహణను లీజుకు ఇచ్చేందుకు నగరపాలకసంస్థ సోమవారం టెండర్ పిలిచింది. ఏడాది లీజుకు రూ.20 లక్షలు, జ్యోతిబాపూలే పార్క్‌కు రూ.10 లక్షలుగా నిర్ణయించినట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు. రెండేళ్ల నిర్వహణ, మేనేజ్‌మెంట్ కోసం ఆసక్తి ఉన్న వాళ్లు బిడ్ దాఖలు చేయాలని కోరారు. కమిషనర్, నగరపాలకసంస్థ పేరిట తీసిన రూ.5 వేల డీడీ చెల్లించి, సోమవారం నుంచి జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్ డాక్యుమెంట్లు తీసుకోవచ్చన్నారు. జనవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు బిడ్ దాఖలు చేయాలన్నారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు బిడ్‌లు తెరవనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవవారు వివరాలకు 7093972078కు సంప్రదించాలన్నారు.
పనుల్లో వేగం పెంచండి
కరీంనగర్: గ్రామాలు, మండలకేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఎంపీడీవోలను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్లో పంచాయతీరాజ్, ఉపాధి హామీ, జిల్లా పరిషత్ అభివృద్ధి పనులపై అధి కారులతో సమీక్షించారు. ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. ఎంపీడీవో కార్యాలయాలకు మరమ్మతులు పూర్తిచేయాలన్నారు. మార్చి నెల సమీపిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. వేసవిలో మంచి నీటి సరఫరాకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించాలన్నారు. జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో రవీందర్, డీఆర్‌డీవో శ్రీధర్ పాల్గొన్నారు.
‘వర్సిటీకి నిధులు ఇప్పించండి’
కరీంనగర్ సిటీ: శాతవాహ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాలని వర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ కేంద్రమంత్రి బండి సంజయ్‌ని కోరా రు. ఈ మేరకు సంజయ్‌ని ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియం ఆధునీకరణకు రూ.50లక్షలు, క్రీడామైదానంలో సింథటిక్ ట్రాక్‌కు రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. విశ్వవిద్యాలయంలో నూ తనంగా ప్రవేశ పెట్టబడుతున్న లా కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్థానిక ఎంపీగా సిఫారసు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment