సర్వే త్వరగా పూర్తి చేయండి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సమీక్షించారు. ఇందిరమ్మ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రజాపాలన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా 2,10,677 దరఖాస్తులు రాగా వాటి పరిశీలనకు 623 మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 80.77శాతం సర్వే పూర్తయిందన్నారు. గ్రామాల్లో 87.04 శాతం, మున్సిపాలిటీలైన జమ్మికుంటలో 96.94శాతం, హుజురాబాద్‌లో 90.75శాతం, చొప్పదండిలో 84.01శాతం, కొత్తపల్లిలో 72.15శాతం, కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 55.26శాతం సర్వే పూర్తయినట్లు వివరించారు. శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే అలాంటి వారి వివరాలు యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్న దృష్ట్యా దరఖాస్తుదారుల వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
వేడుకపై పోలీసు నజర్
● తీగలవంతెన, మానేరు డ్యాంకట్టపైకి రాకపోకలు నిషేధం
● విస్తృతంగా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు
కరీంనగర్‌క్రైం: డిసెంబర్ 31, నూతన సంవత్స ర వేడుకలపై కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు నజర్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినా, ముందస్తు అనుమతులు లేకుండా జనసమూహంగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించినా, ప్రైవేట్ పార్టీలు నిర్వహించినా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అభిషేక్ మహంతి హెచ్చరించారు.
తీగల వంతెన, ఎల్‌ఎండీ కట్టపైకి నో ఎంట్రీ
డిసెంబర్ 31 సాయంత్రం 6గంటల నుంచి మరునాడు ఉదయం 5గంటల వరకు మానేరుడ్యాం కట్టతో పాటు తీగలవంతెనపైకి వెళ్లడం నిషేధించినట్లు సీపీ వెల్లడించారు. నగరవాసులు, సిటీకి వచ్చివెళ్లేవారు ఇతర మార్గాల్లో ప్ర యాణించాలన్నారు. డీజేలపై నిషేధాజ్ఞలు ఉ న్నాయన్నారు. బైక్ సైలెన్సర్లను మార్చి శబ్దకా లుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31 సందర్భంగా పెద్దఎత్తున పోలీసు ఫోర్స్‌తో బందోబస్తు నిర్వహిస్తామని వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సీపీ అభిషేక్ మహంతి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment