వినూత్న నిరసన
కరీంనగర్: గత 18ఏళ్లుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకిరీ చేస్తున్న ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం చేతులకు తాళ్లతో బంధించుకుని వినూత్న నిరసన తెలిపారు. వారి డిమాండ్లు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 21రోజు కొనసాగింది. జిల్లా గౌరవాధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్, జిల్లా ఉపాధ్యక్షులు రమేశ్, రవిచంద్ర, శ్రీనివాస్, భరత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment