‘మీకోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ’
శంకరపట్నం(మానకొండూర్): 2024 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి 2025 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు మద్యం తాగి వాహనాలు నడిపేవారు, రోడ్లపై స్టంట్లు, న్యూసెన్స్ చేసేవారి కోసం మీకోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్ రెడీ పేరిట శంకరపట్నం మండలంలో సామాజిక మాధ్యమంలో కేశవపట్నం ఎస్సై రవి వినూత్న రీతిలో పోస్టులు పెట్టి యువతను ఆలోచనలో పడేశారు. డ్రగ్స్ సేవించే వ్యక్తుల కోసం తెలంగాణ పోలీసులు బేడీలతో రెడీగా ఉన్నారని, సహాయం కోసం డయల్ 100ను సంప్రదించాలని పోలీసులు ముద్రించిన రాతలు వైరలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment