అంబేడ్కర్ ఆశయాల కోసం బీజేపీ పని చేస్తుంది
కరీంనగర్‌టౌన్: భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ఆలోచన విధానాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్‌లో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యనారాయణ మాట్లాడుతూ అంబేడ్కర్‌పై కాంగ్రెస్‌ది కపట ప్రేమ అన్నారు. 75 ఏళ్లుగా కాంగ్రెస్ అంబేడ్కర్‌ను పలుమార్లు అగౌరవపరిచిందన్నారు. పాత పార్లమెంట్ హాల్లో కనీసం అంబేడ్కర్ ఫొటోను పెట్టలేక పోయిందన్నారు. రాజ్యాంగాన్ని కాలరాసి దేశంలో ఎమర్జెన్సీ రోజులు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి బీజేపీ కృషి చేసిందన్నారు. బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని, సంవిదాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు విజ యవంతంగా జరగాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు మాట్లాడారు. బంగారు రాజేంద్ర ప్రసాద్, కోమల ఆంజనేయులు, కన్నెబోయిన ఓదెలు, మాడ వెంకట్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment