నిధుల కోసం నిలదీసే పరిస్థితి తేవద్దు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు మార్చిలోగా పూర్తి చేయాల ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. నిధుల కోసం ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. సోమవారం నగరంలోని 32వ డివిజన్ భవానీనగర్, వివేకానందనగర్‌లో రూ.45 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నగరపాలకసంస్థ మీద భారం పడకుండా ప్రభుత్వం నుంచి సహకారం అందించామన్నారు. ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.350 కోట్లు కేటాయించామని తెలిపారు. 50ఏళ్ల దరిద్రాన్ని పోగొట్టేందుకు ఈ పదేళ్లు సరిపోలేదన్నారు. గతంలో చేపట్టిన సుమారు రూ.85 కోట్ల సీఎం హామీ పథకం నిధుల పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇందులో రూ.25 కోట్ల పనులు మొదలు కూడా కాలేదన్నారు. జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ పెద్దలు పెండింగ్ పనులను ఫిబ్రవరిలో మొదలు పెట్టి, మార్చి ఒకటో తేదీలోగా పూర్తి చేయాలన్నారు. మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్ మర్రి భావన సతీష్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, జంగిలి సాగర్, తోట రాములు, కచ్చు రవి, నాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మార్చిలోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలి
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Comments
Please login to add a commentAdd a comment