వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
చొప్పదండి/రామడుగు/గంగాధర: వైద్యారోగ్యశాఖ సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. రామడుగు మండలం గుండిగోపాల్‌రావుపేట, రామడుగు, గంగాధర పీహెచ్‌సీలతో పాటు చొప్పదండి మండలం గుమ్లాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణుల నమోదు, వ్యాక్సినేషన్ వందశాతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం పలు రికార్డులు తనిఖీ చేశారు. గుమ్లాపూర్‌లో గర్భిణులతో సమావేశమయ్యారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆరో గ్య మహిళ కార్యక్రమం గురించి అవగాహన పెంచాలని కోరారు. వైద్యాధికారి అరుణ, సూపర్‌వైజర్ శోభ పాల్గొన్నారు.
సిటీలో నేడు పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు 11 కేవీ జగిత్యాల, కోర్టు ఫీడర్ల పరిధిలోని సాయిబాలాజీనగర్, సీతా రాంపూర్, జగిత్యాల రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 33/11 కేవీ చెర్లభూత్కూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెర్లభూత్కూర్, చామన్‌పల్లి, దుబ్బపల్లి, తాహెర్‌కొండాపూర్, బహద్దూర్‌ఖాన్‌పేట, జూబ్లీనగర్, ఫకీర్‌పేట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
అర్బన్ బ్యాంకు అభివృద్ధికి కృషి
కరీంనగర్ కార్పొరేషన్: అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి అన్నారు. పర్సన్ ఇన్‌చార్జి కమిటీ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన విలాస్‌రెడ్డి సోమవారం అర్బన్ బ్యాంక్ కార్యాలయంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చైర్‌పర్సన్ హోదాలో ఉన్న అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ బాధ్యతలు విలాస్‌రెడ్డికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అర్బన్ బ్యాంక్‌ను బలోపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ కమిటీ సభ్యులు ముక్క భాస్కర్, బొమ్మరాతి సాయికృష్ణ, మూల లక్ష్మి,విద్యాసాగర్, లక్ష్మణ్‌రాజు, సిమియోద్దిన్, మంగి రవి, నాగుల సతీష్, మార్క రాజు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ పాల్గొన్నారు.
ఆర్టిజన్ల రిలే దీక్షలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టుల్లోకి మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కరీంనగర్ విద్యుత్ భవన్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షేషన్– జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్ సంస్థలో గత 18 ఏళ్ల పైబడి విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించగా ఉద్య మం చేపట్టడంతో విద్యుత్ సంస్థలో విలీనం చేస్తూ ఆర్డర్ ఇచ్చారన్నారు. 23,667 మంది ఆర్టిజన్లను పర్మినెంట్ చేసినట్లు అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ అమలు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సేవలను గుర్తించి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీవీఏసీ జేఏసీ జిల్లా చైర్మన్ ఎ.శివకృష్ణ, నాయకులు ఎస్.సదానందం, రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment