బోనస్ కోసం నిరీక్షణ
● సన్నాల డబ్బులు అందక రైతుల ఆందోళన ● రూ.2.95 కోట్లు పెండింగ్
కరీంనగర్‌రూరల్: కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను విక్రయించిన రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ధాన్యం విక్రయించి రెండు నెలలవుతున్నప్పటికీ బ్యాంకుఖాతాల్లో బోనస్ జమకాకపోవడంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1,21,415 ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేయగా సుమారు 2,48,823 మెట్రిక్‌టన్నుల దిగుబడి వస్తుందని అంచనావేశారు. నవంబరు మొదటివారంలో 340 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సన్నాలకు కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర రూ.2,320 ఉండగా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసింది. మొత్తం 72,152 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు రూ.500చొప్పున బోనస్ మొత్తం రూ.36.07కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.33.12 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.2.95కోట్ల బోనస్ రైతులకు చెల్లించాల్సి ఉంది. గత నెల 13నుంచి రైతులబ్యాంకుఖాతాల్లోకి సన్నాల బోనస్ డబ్బులను అధికారులు జమ చేస్తున్నారు. అయితే పలువురు రైతులు ధాన్యం విక్రయించి రెండునెలలవుతున్నప్పటికీ డబ్బులు జమకాకపోవడంతో ఆందోళనచెందుతున్నారు. ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్‌నెంబరు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకుఖాతానెంబర్ల వివరాలు సరిగ్గా లేకపోవడంతోపాటు ఈకేవైసీ సమస్యతో ఆన్‌లైన్ నమోదులో జాప్యంతో రైతులకు బోనస్ జమ కావడంతో జాప్యం జరుగుతుందని సివిల్‌సప్‌లై అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment