గ్రామసభలకు వేళాయే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఎంపిక పక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే ఇంటింటికి తిరిగి సర్వేనిర్వహిస్తున్న అఽధికారులు మంగళవారం నుంచి గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహించే గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదా రుల జాబితాను అధికార యంత్రాంగం తయారు చేయనుంది. గతంలో ప్రజాపాలన, కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకోని వారు సైతం కొత్తగా గ్రామసభల్లో రేషన్‌కార్డులు, ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు గ్రామసభలపై ఉంది. పైరవీలకు తావులేకుండా పారదర్శకతతో గ్రామసభల ద్వారా ఎంపిక చేస్తారా? లేదా అనే చర్చ లబ్ధిదారుల్లో కొనసాగుతోంది.
నేటి నుంచి గ్రామసభలు
గ్రామసభల కోసం ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్పెషలాఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, వారికి కింద సిబ్బంది సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే ఆయా పథకాల అర్హులైన వారిని గుర్తించేందుకు యంత్రాంగం సర్వే నిర్వహించి ముసాయిదా సిద్ధం చే సింది. ఆయా జాబితాలను గ్రామాల్లో, బల్దియాల్లో వార్డులవారీగా ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో జాబితా ప్రదర్శించి, లబ్ధిదారుల పేర్లును చదివి వినిపించనున్నారు. గ్రామసభల ఆమోదం పొందిన జాబితాను జిల్లాఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఇప్పటికే పలు పథకాల కోసం వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీ స్ యాప్ ద్వారా వడబోసి ముసాయదా జాబి తాను కొలిక్కి తీసుకువచ్చారు. ఈమేరకు ఎంపీడీవో లాగిన్ ద్వారా ముసాయిదా జాబితాను డౌన్‌లోడ్ చేసుకుని, అభ్యంతరాల అనంతరం అదే లాగిన్ ద్వారా తుది జాబితాను అప్‌లోడ్ చేయనున్నారు. కీలక పథకాలకు ఆధారమైన గ్రామసభలకు హాజరయ్యేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు రానున్నారు.
గ్రామసభల్లో కొత్త దరఖాస్తులు..
కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జాబితా జిల్లాయంత్రాంగానికి చేరింది. ఐతే అందులో చాలామంది అర్హులైన వారి పేర్లు లేవు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేయడానికి పోయినప్పుడు ప్రజలనుంచి నిరసన, వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా కొత్తవారికి అవకాశం కల్పించాలని కలెక్టర్లకు మార్గదర్శకాలను సీఎస్ జారీచేశారు. పాత కార్డులు ఉండటంతో పాటు, చేర్పులు మార్పుల కోసం, ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులతో పాటు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు సైతం ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వాటిని పరిశీలించాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇటీవల కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో విలీనం అయిన గ్రామాల్లో సైతం 2023–24 సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధిహామీ కూలీ పనులకు పోయిన వారిని అర్హులుగా గుర్తించనున్నారు. అర్హులైన వీలిన గ్రామప్రజలకు ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల సహాయం అందించనున్నారు. ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్‌లో చింతకుంట, మల్కాపూర్–లక్ష్మీపూర్, బొమ్మకల్, కొత్తపల్లి మున్సిపాలిటీ, గోపాల్‌పూర్, దుర్శేడ్ గ్రామాల్లో ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ప్రతీ గ్రామసభలో దరఖాస్తుదారుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలుకు నేటినుంచి గ్రామాల్లో సమావేశాలు
ఆత్మీయ భరోసా, రైతు భరోసాల లిస్టులు ఇక్కడే ఖరారు
అభ్యంతరాల అనంతరం తుది జాబితా అప్‌లోడ్
కొత్తరేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు తాజా దరఖాస్తులు
జనవరి 26 నుంచి పథకాల అమలుకు కసరత్తు
గ్రామసభల కోసం సొంతూళ్లకు దరఖాస్తుదారులు
Comments
Please login to add a commentAdd a comment