అయ్యా.. కొడుకులు పట్టించుకుంట లేరు
గోదావరిఖని: తమ కుమారులు పట్టించుకోవడం లేదని, భూమికోసం చేసిన అప్పులు పెరిగి వడ్డీలు కట్టలేకపోతున్నామని ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం సీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన గుజ్జల సాయిలు – చిలకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకొడుకు మల్లికార్జున్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండగా చిన్నకొడుకు రమేశ్ విద్యుత్‌శాఖలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెద్దకొడుకుకు రెండెకరాల పొలం, చిన్న కుమారునికి ఒకటిన్నర ఎకరాలను తండ్రి రిజిస్ట్రేషన్ చేసిఇచ్చాడు. అంతకు ముందే పొలం కొనడానికి రూ.10 లక్షల అప్పు చేశాడు. ఆ భూమి పంచి ఇచ్చినా, అప్పు తీర్చే పరిస్థితి లేదు. ఈ విషయంలో కుమారులు తల్లిదండ్రల గురించి పట్టించుకోవడం లేదు. కనీసం నిత్యాసరాల కోసం ఖర్చు కూడా ఇవ్వడం లేదరు. బాధితుల గోడు విన్న సీపీ.. సంబంధిత ఏరియా పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు రెఫర్ చేశారు. సీపీ మాట్లాడుతూ వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల బాగోగుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఠాణా మెట్లెక్కిన వృద్ధ దంపతులు
Comments
Please login to add a commentAdd a comment