![తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా చోరీలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06gdk09-180119_mr-1738870753-0.jpg.webp?itok=j_ntdi4A)
తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా చోరీలు
గోదావరిఖని: జల్సాల కోసం తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రమేశ్ తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రమేశ్‌నగర్‌కు చెందిన ఐత రమేశ్(32) మధ్యాహ్నంలో తాళం వేసిన ఇళ్ల కోసం రెక్కి చేస్తున్నాడు. రాత్రి చోరీలు చేస్తున్నాడు. ఆ సొమ్మును జల్సాల కోసం ఖర్చు చేస్తున్నాడు. చోరీల నియంత్రణ కోసం మూడు క్రైం టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడంతో రమేశ్ పట్టుపడ్డాడు.
నేరాల చిట్టా..
వారం క్రితం మార్కండేయకాలనీకి చెందిన రమేశ్ ఇంటి తాళం పగులగొట్టి రూ.3.42 లక్షల నగదు చోరీ చేశాడు. ఆ డబ్బులతో హైదరాబాదులో కారు, రెండు మొబైళ్లు కొనుగోలు చేశాడు. 15 రోజుల క్రితం అశోక్‌నగర్ చెందిన పులిపాక స్వరూప ఇంట్లో దూరి గ్యాస్ సిలిండర్, డబ్బులు చోరీచేశాడు. ఏడు నెలలక్రితం మార్కండేయ కాలనీలో తాళం వేసిన ఇంట్లో బంగారు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లాడు. 11 నెలల క్రితం ప్రశాంత్‌నగర్‌లో తాళం వేసిఉన్న ఇంట్లో నాలుగున్నర తులాల బంగారం, 16 తులాల వెండి చోరీ చేశాడు. ఆధునిక టెక్నాలజీ సాయంతో నిందితుడిని పోలీసులు పట్టుకుని, కొంత రికవరీ చేశారు. గతంలో కూడా ఐత రమేశ్ 11 చోరీ కేసుల్లో నిందితుడు.
కారు, మొబైల్స్ స్వాధీనం..
నిందితుని నుంచి కారు, రెండు మొబైళ్లు, రూ.20వేల నగదు, 130గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు. నిందితున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఇంద్రసేనారెడ్డి, రెండో సీఐ రవీందర్, క్రైం పార్టీ సిబ్బంది రమేశ్, శ్రీనివాస్, వెంకటేశ్, రమేశ్, మధుసూదన్‌ను ఏసీపీ అభినందించారు. నగదు రివార్డు అందజేశారు.
నిందితుడి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment