చెరో కాంస్యం
పాఠశాలలో రసణ్య 8, శృతి 9వ తరగతి చదువుతున్నారు. రసణ్య 9–11 ఏళ్ల విభాగంలో 100 మీ.రన్నింగ్ రేస్, శృతి 15–17 ఏళ్ల విభాగంలో షాట్‌పుట్‌లో ప్రతిభచాటి కాంస్య పతకాలు సాధించారు. రసణ్య గతేడాది 50 మీ. రన్నింగ్‌లో రజత పతకం సాధించింది.
హార్డిల్స్‌లో రజతం
7వ తరగతి చదువున్న ప్రణీత్ 9–11 ఏళ్ల విభాగంలో హర్డిల్స్ రేస్‌లో పాల్గొన్నాడు. హార్డిల్స్‌పై జంపింగ్ చేస్తూ పరిగెత్తి రజత పతకం సాధించాడు. ఫస్ట్ టైం పోటీల్లో పాల్గొన్న ప్రణీత్ వచ్చే ఏడాది గోల్డ్‌మెడల్ సాధిస్తానని పేర్కొన్నాడు.
రన్నింగ్‌లో గోల్డ్ మెడల్
2023లో జరిగిన 200 మీ.రన్నింగ్ రేస్‌లో మణికంఠ ర జత పతకం సాధించాడు. ప్రస్తుతం గోల్డ్ మెడల్ సాధించాడు. 9వ తరగతి చదువుతున్న మణికంఠ 12–14 ఏళ్ల విభాగంలో పోటీపడ్డాడు. భవిష్యత్‌లో పెద్ద టోర్నమెంట్‌లో విజయం సాధించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు.
సత్తాచాటారు
జాతీయ ఒలింపియాడ్ స్పోర్ట్స్‌లో మా పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. వివిధ పోటీల్లో 11 పతకాలు సాధించారు. పెద్ద మొత్తంలో పతకాలను కై వసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
– జి.కమల, ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment