![కుక్కలతో చిన్నారికి సోకిన వైరస్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vmd53-180057_mr-1738870755-0.jpg.webp?itok=oqEGhz4G)
కుక్కలతో చిన్నారికి సోకిన వైరస్
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ చిన్నారికి కుక్కల ద్వారా వైరస్ సోకి అస్వస్థత కు గురైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేథ(4) అనే చిన్నారికి జ్వరంతోపాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అలర్జీ ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అన్ని పరీక్షలు చేసినా వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో నాలుగు రోజుల క్రితం హైదరా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ‘బ్రూసెల్లా ఇథిపికల్’ వైరస్‌గా గుర్తించారు. కలుషితమైన చికెన్ వ్యర్థాలు, నీటిని తాగడం, పచ్చిమాంసం వ్యర్థాలు తినడం ద్వారా కుక్కలకు సోకుతుందని వైద్యులు తెలిపారు. ఆ వైరస్ సోకిన కుక్కలు తిరిగిన ప్రాంతంలో చిన్నారులు తిరిగితే వైరస్ సోకే ప్రమాదం ఉందని వివరించారు ఇలాగే చిన్నారి శ్రీమేథకు సైతం సోకి ఉంటుందని వారు వివరించారు.
హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స
Comments
Please login to add a commentAdd a comment