![శుభకార్యానికి వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06dmp102-180137_mr-1738870755-0.jpg.webp?itok=ZSFnwA5q)
శుభకార్యానికి వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు
వెల్గటూర్: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా టి ప్పర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం గుల్లకోట శివారులో జరిగింది. పోలీసులు, స్థా నికులు కథనం ప్రకారం ఎండపల్లి మండలకేంద్రానికి చెందిన చీకటి వెంకటేశ్ (47) ఉపాధి కోసం ట్రాలీ ఆటో నడుపుకుంటున్నాడు. రాత్రివేళ రాజారాంపల్లిలోని పెట్రోల్‌బంక్‌లో పని చేస్తున్నాడు. చెర్లపల్లిలోని తమ బంధువుల ఇంట్లో గురువారం జరిగిన శుభకార్యంలో పాల్గొన్నాడు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా గుల్లకోట ఐకేపీ కేంద్రం సమీపంలో రోడ్డు ప క్కన ఉన్న మట్టి కుప్పను ఢీకొని బైక్‌పై నుంచి కింద పడ్డాడు. అదే సమయంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వెంకటేశ్ తలపై నుంచి వె ళ్లడంతో తల, మొండెం వేరయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వెంకటేశ్‌కు భార్య లక్ష్మి, కుమారుడు నవీన్, కూతురు మమత ఉన్నారు. అప్పటివరకు అందరితో కలివిడిగా ఉన్న వెంకటేశ్ మృతిచెండదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య పిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
వ్యక్తి తలపై నుంచి దూసుకెళ్లిన టిప్పర్ లారీ
నుజ్జునుజ్జయిన తల
Comments
Please login to add a commentAdd a comment