![‘సైలె](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/05knt217-180094_mr-1738870752-0.jpg.webp?itok=ch5LRng0)
‘సైలెంట్’గా సాధించారు..
● బధిరులు.. ఆటల్లో చిచ్చరపిడుగులు
● జాతీయ సైలెంట్ ఒలింపియాడ్ స్పోర్ట్స్‌లో జిల్లా విద్యార్థులకు పతకాలు
● రెండు బంగారు, ఆరు రజత, ఐదు కాంస్య పతకాలతో సత్తా
● అభినందించిన కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌స్పోర్ట్స్: ఏదైనా చెబితే వినపడదు.. మాటలు రావు.. ఎలా ఆడాలో తెలియదు.. మనం ఆడి వారికి చూపిస్తే మనలా ఆడేస్తారు.. అలాంటి విద్యార్థులు ముంబయి వేదికగా జరిగిన జాతీయ సైలెంట్ ఒలింపియాడ్ స్పోర్ట్స్‌లో సత్తా చాటారు కరీంనగర్‌లోని మల్కాపూర్ రోడ్‌లో గల ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. బాంబె రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 2న పోటీలు నిర్వహించగా, కరీంనగర్ పాఠశాల నుంచి 22 మంది బాలురు, 15 మంది బాలికలు పాల్గొన్నారు. 2 బంగారు, 6 రజత, 5 కాంస్య పతకాలు సాధించారు. పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులను ఇటీవల కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఈసందర్భంగా పలువురు
విద్యార్థులపై కథనం.
షాట్‌పుట్‌లో కాంస్యం
పదో తరగతి చదువుతున్న రాజు 15–17 ఏళ్ల విభాగంలో షాట్‌పుట్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. భవిష్యత్‌లో పెద్దపెద్ద పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తానని తెలిపాడు. గతేడాది రిలే రేస్‌లో పతకం సాధించకపోగా, ప్రస్తుతం గేమ్ మార్చుకొని సక్సెస్ అయ్యాడు.
దినేశ్‌కు రెండు పతకాలు
9వ తరగతి చదువుతున్న దినేశ్ 100 మీ.రన్నింగ్‌లో చిరుతల పరుగుపెట్టి రజత పతకం సాధించాడు. షాట్‌పుట్‌లో 9 మీటర్లకు పైగా విసిరి కాంస్య పతకం అందుకున్నాడు. 12–14 ఏళ్ల విభాగంలో పోటీపడిన దినేశ్ భవిష్యత్‌లో నీరజ్ చోప్రా జావెలీన్‌లా షాట్‌పుట్ విసురుతానని పేర్కొన్నాడు.
![‘సైలెంట్’గా సాధించారు..1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/05knt212-180094_mr-1738870752-1.jpg)
‘సైలెంట్’గా సాధించారు..
![‘సైలెంట్’గా సాధించారు..2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/05knt210-180094_mr-1738870752-2.jpg)
‘సైలెంట్’గా సాధించారు..
Comments
Please login to add a commentAdd a comment