![గొడుగు లేనిదే బయటకు రాలేని పరిస్థితి (ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/6/05bng301_mr.jpg.webp?itok=Ag_smnuA)
గొడుగు లేనిదే బయటకు రాలేని పరిస్థితి (ఫైల్)
బనశంకరి: దక్షిణ కన్నడ జిల్లాలో వేసవి భానుడు భగభగ మండుతున్నాడు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో వడగాల్పులు కూడా మొదలయ్యాయి. ఉదయం పది గంటలు దాటితే బయటకు వెళ్లడానికి ప్రజలు భయపడుతున్నారు.
మార్చి మొదటి వారంలోనే...
కరావళి, ఒళనాడు ప్రాంతాల్లో ప్రజలు భానుడి ప్రతాపంతో తల్లడిల్లుతున్నారు. ప్రత్యేకత ఏమిటంటే మూడబిదిరె, సుళ్యలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. శుక్రవారం 3 తేదీ దక్షిణ కన్నడ జిల్లాల్లో పలుచోట్ల 40–41 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరగ్గా వేడి గాలులు కూడా అధికమయ్యాయి. సూర్యుడు నిప్పుల కొలిమిలా మారుతున్నాడు. అదే విధంగా మూడబిదిరె ప్రాంతంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం చలి, మంచు ..
మంగళూరు నగరంతో పాటు జిల్లాలోని పలుప్రాంతాల్లో ఉదయం మంచు, చలితో కూడిన వాతావరణం నెలకొంది. ఉదయం 11 గంటలు కాగానే ఉష్ణోగ్రతలు పెరుగుతూ 12.30 గంటలు కాగానే ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. 12.30 నుంచి 1 గంట సమయానికి ఎండ భగభగ మండిపోతుంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రజలు ఇళ్లలోనుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
ఆరోగ్య సమస్య..
వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రత, ఎండల వేడితో జిల్లావ్యాప్తంగా ప్రజలు జ్వరాలు, తలనొప్పి, జలుబు తదితర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వీచే గాలి కూడా వేడిగా ఉండటంతో బావులు, చెరువులు, బోర్లలో నీటి ప్రమాణం కూడా తగ్గుముఖం పడుతోంది. ఇలా ఎన్నిరోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటుంది అనేది వేచిచూడాలి.
తాగునీటి ఇబ్బందులు..
దక్షిణ కన్నడ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో తాగునీటికి కష్టాలు తప్పవనే భయం నెలకొంది. మంగళూరు నగరానికి తాగునీరు అందించే తుంబేబెంటెడ్ డ్యాంలో నీటిమట్టం తగ్గింది. డ్యాంలో నీటిమట్టం 5.95 మీటర్లకు తగ్గుముఖం పట్టింది. జీవనదిగా పేరుపొందిన నేత్రావతి ఇన్‌ఫ్లో కూడా తగ్గుముఖం పట్టడంతో తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు.
ప్రారంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
బెంబేలెత్తుతున్న కరావళి ప్రజలు
![అమాంతం పెరిగిన ఎండల తీవ్రత 1](https://www.sakshi.com/gallery_images/2023/03/6/05bng300_mr.jpg)
అమాంతం పెరిగిన ఎండల తీవ్రత
Comments
Please login to add a commentAdd a comment