యణ్ణే రంగస్వామి రథోత్సవంలో పాల్గొన్న అశేష భక్త జనం
కణేకల్లు: మహిమాన్వితుడు యణ్ణే రంగస్వామి రథోత్సవం మండలంలోని యర్రగుంట గ్రామంలో శుక్రవారం అంగరంగవైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి మంగళారతి, మహా మంగళారతి, పంచామృతాభిషేకం తదితర పూజలను నిర్వహించారు. సాయంకాలం 5గంటల సమయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని తేరులో ప్రతిష్టించారు. స్వామి నామాన్ని జపిస్తూ వేలాది మంది భక్తులు తేరును లాగారు. తేరు కదలగానే భక్తులు అరటిపండ్లను విసిరారు. బళ్లారి ప్రాంతం నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కాపు భారతి దంపతులు విశేష పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment