కర్ణాటక: డబుల్ చార్జిపై ప్రశ్నించిన ఓ ప్రయాణికుడిని ఆటో డ్రైవర్ హత్య చేసిన ఘటన బెంగళూరు యశ్వంతపుర్ సోప్ ఫ్యాక్టరీ వద్ద చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ అశ్వత్థ దాడిలో అసోం చెందిన అహ్మద్ (28) మృతి చెందగా, అహ్మద్ సోదరుడు ఆయూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. అహ్మద్, ఆయూబ్ ఇద్దరూ జీవనోపాధి కోసం బెంగళూరుకు వలస వచ్చి యశ్వంతపూర్‌లో నివసిస్తున్నారు.
ఆదివారం అర్ధరాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఇద్దరూ ఆటో మాట్లాడారు. అయితే ఆటో డ్రైవర్ డబుల్ చార్జీ ఇవ్వాలని డిమాండు చేసాడు. దీన్ని ప్రశ్నించిన అన్నదమ్ములపై ఆటో డ్రైవర్ అశ్వత్థ మారణాయుధంతో దాడి చేసాడు. దాడిలో అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించి సుబ్రమణ్యపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసారు.
Comments
Please login to add a commentAdd a comment