ప్రాణం తీసిన రిమోట్‌ గొడవ | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన రిమోట్‌ గొడవ

Published Mon, Oct 16 2023 1:04 AM | Last Updated on Thu, Oct 19 2023 11:07 AM

- - Sakshi

కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న తల్లి

సాక్షి,బళ్లారి: టీవీ రిమోట్‌ కోసం అన్నదమ్ములు గొడవ పడుతుండటాన్ని భరించలేక తండ్రి ఆవేశంతో చేసిన పని ఘోర విషాదానికి దారితీసింది. కత్తెర విసరడంతో గొంతు తెగి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన దారుణ సంఘటన చిత్రదుర్గం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూర్‌ పట్టణంలోని ఎన్‌ఎస్‌ఎం కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మణ బాబుకు ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్‌ (16), పవన్‌ కుమార్‌ (14). శనివారం రాత్రి అన్నదమ్ములు ఇద్దరు టీవీ చూసే సమయంలో రిమోట్‌ కోసం గొడవపడ్డారు. చిన్నారుల మధ్య గొడవ ఆపడానికి తండ్రి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర ఆవేశంతో ఊగిపోయిన లక్ష్మణబాబు తన పక్కనే ఉన్న పొడవైన కత్తెర తీసుకుని ఒక్కసారిగా ఇద్దరి వైపు విసిరాడు. కత్తెర చంద్రశేఖర్‌ గొంతుకు గుచ్చుకుంది.

దీంతో తీవ్ర రక్తస్రావంతో అతను కిందపడిపోయాడు. వంట గదిలో ఉన్న తల్లి అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన మొళకాల్మూర్‌ ఆసపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి బళ్లారి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. బళ్లారికి వెళ్తుండగా మార్గంమధ్యలోనే చంద్రశేఖర్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోపంతో కన్న కుమారుడిని చంపిన తండ్రి జైలుకు వెళ్లడంతో పాటు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement