ఆందోళన చేస్తున్న కార్యకర్తలు
రాయచూరు రూరల్: భూమిని ఆక్రమించిన వారిపై, అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నరసింహులు మాట్లాడారు. నకిలీ రికార్డులు సృష్టించి అక్రమంగా సాబణ్ణ ఆక్రమించిన భూమిని హనమంతప్పకు అప్పగించాలన్నారు. సిరవార తాలూకా మల్లట్ మండలం కలంగేరలో 4 ఎకరాల భూమిని రెవిన్యూ అధికారులు ఏకమై హనమంతప్ప భూమికి సంబంధించిన పట్టాను సాబణ్ణ పేరుతో మార్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment