వాగు నీటిలో కొట్టుకెళ్లి బాలుడి దుర్మరణం | Sakshi
Sakshi News home page

వాగు నీటిలో కొట్టుకెళ్లి బాలుడి దుర్మరణం

Published Thu, May 9 2024 7:05 AM

-

రాయచూరు రూరల్‌: తాలూకాలోని జేగరకల్‌ వాగుకు నారాయణపుర కాలువ నుంచి నీరు వదలడంతో మంగళవారం వాగు నీటిలో కొట్టుకెళ్లి ఓ బాలుడు దుర్మరణం పాలైన ఘటన తాలుకాలో చోటు చేసుకుంది. వివరాలు..మృతుడిని తాలూకాలోని జేగరకల్‌ చెందిన వినాయక్‌(5)గా పోలీసులు గుర్తించారు. వేసవిలో మండుతున్న ఎండ నుంచి ఉపశమనం కోసం వాగు వద్దకు స్నానం చేయడానికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటలైనా బాలుడి ఆచూకీ కనిపించలేదు. చివరికి కుటుంబ సభ్యులు వాగు వద్దకు వెళ్లి చూడగా పాదరక్షలు లభించాయి. వాగులో ముళ్ల కంప చెట్లకు బాలుడి మృతదేహం చిక్కుకుని కనిపించింది. వెంటనే గ్రామస్తులు మృతదేహాన్ని బయటికి తెచ్చారు. బాలుడి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement