రేపిస్టు డ్యాన్స్‌మాస్టర్‌ | - | Sakshi
Sakshi News home page

రేపిస్టు డ్యాన్స్‌మాస్టర్‌

Published Tue, Aug 20 2024 12:28 AM | Last Updated on Tue, Aug 20 2024 9:36 AM

-

అర్ధరాత్రి యువతిపై లైంగిక దాడి..

నిందితుడు అరెస్టు

బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్లిలో శనివారం అర్ధరాత్రి సమయంలో యువతి (21)పై ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. కోల్‌కతాలో మెడికోపై జరిగిన హత్యాచారం మీద దేశమంతటా నిరసనలు వెల్లువెత్తిన సమయంలో ఐటీ నగరిలో అత్యాచారం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆ కామాంధున్ని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు సోమవారం నగర ఆగ్నేయ విభాగం డిసిపి నూర్‌ ఫాతిమా తెలిపారు. 

నిందితుడు తమిళనాడుకు చెందిన ముకేశ్వరన్‌ (24) అని, ఆడుగోడిలోని ఇంటిలో ఉండగా అరెస్టు చేశామన్నారు. ముకేశ్వరన్‌ డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేస్తాడని, ఇతని మీద గతంలో ఎలాంటి కేసులు లేవని అన్నారు. శనివారం రాత్రి యువతి స్నేహితులతో కలిసి కోరమంగళలో పబ్‌కు వెళ్లి అర్ధరాత్రి 1.30 గంట సమయంలో వస్తూ బైకిస్టు ముకేశ్వరన్‌ను లిఫ్ట్టు అడిగింది. అతడు బైక్‌లో నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి ఆమైపె దాడి చేసి అత్యాచారం చేసి పరారయ్యాడు.

సీసీ కెమెరాల ఆధారంగా
ఆమెను బైక్‌లో ఎక్కించుకున్న చోట సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితుని కోసం గాలింపు చేపట్టి పట్టుకొన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుడు 2003 నుంచి ఆడుగోడిలో నివాసం ఉంటున్నాడని, ఒక ప్రైవేటు స్కూల్‌లో డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. బాధితురాలు ఆర్మీ అధికారి కుమార్తె అని, ఆనేకల్‌ వద్ద కాలేజీలో డిగ్రీ చివరి ఏడాది చదువుతోందని తెలిపారు. యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోందని చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement