సదుపాయాల కోసం జనాందోళన
మైసూరు: నగరంలోని చెలువాంబ ప్రభుత్వ ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారిణి డాక్టర్ విద్యాధరి (42) అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆమె లక్ష్మీపురం అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవారు. కేఆర్ ప్రభుత్వ ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ షణ్ముఖ భార్య. వీరికి 8 – 4 ఏళ్ల వయసు గల ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన విద్యాధరి పిల్లలతో కలిసి గదిలో నిద్రించారు.
సోమవారం ఉదయం 9 గంటలైనా గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో డాక్టర్ షణ్ముఖ వెళ్లి చూడగా, ఆమె మరణించి ఉండడం కనిపించింది. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. విద్యాధరి మృతిపై అనుమానం ఉందని మృతురాలి సోదరుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా సఖ్యత లేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment