వెలుగుల వెంటే చీకట్లు
బనశంకరి: దీపావళి పండుగ అందరికీ ఆనందాన్ని పంచగా కొందరికి మాత్రం విషాదాన్ని మిగిల్చింది. టపాసుల పేలుళ్లలో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. నగరవాసులను బాణసంచా ప్రమాదాల గురించి ఎంత జాగృతం చేసినప్పటికీ గాయాల పాలయ్యారు. కళ్లకు గాయాలు కావడంతో నగరంలోని పలు కంటి ఆసుపత్రుల్లో 80 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. గత ఏడాది దీపావళితో పోలిస్తే ఈసారి బాధితుల సంఖ్య చాలా పెరిగింది.
దృష్టి పోయే ప్రమాదం
● పండుగ ప్రారంభమైన రెండురోజుల్లో 80 మందికి పైగా గాయాలు తగిలించుకున్నారు. నారాయణ నేత్రాలయలో 23 మంది, మింటో కంటి ఆసుపత్రి 22, శంకర కంటి ఆసుపత్రిలో 15, శేఖర్ కంటి ఆసుపత్రిలో 4 తో పాటు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో మరికొందరు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
● గాయపడిన వారిలో కొందరు దృష్టి ని కోల్పోయే ప్రమాదం ఉంది.
● పిల్లలతో టపాసులు కాలుస్తున్నప్పడు గాయపడిన అనంతపురం వాసి (30) నగరంలోని నారాయణ నేత్రాలయ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు శస్త్రచికిత్స చేశామని, ఒక కంటి చూపు మళ్లీ వచ్చే అవకాశం లేదని ఆసుపత్రి అధ్యక్షుడు రోహిత్‌శెట్టి తెలిపారు.
● మింటో కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 9 మంది దృష్టిని కోల్పోయారని డాక్టర్లు తెలిపారు.
● ఈ పరిణామంతో వారి కుటుంబీకులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు.
బెంగళూరులో 80 మందికి
టపాసుల గాయాలు
చాలామందికి కళ్లకు తీవ్ర హాని
Comments
Please login to add a commentAdd a comment