ఖాకీలకు నిందితుడు టోపీ
● హైదరాబాద్‌లో పరారీ
దొడ్డబళ్లాపురం: హత్య కేసు అరైస్టెన నిందితున్ని కొడగు జిల్లా మడికెరి పోలీసులు స్పాట్ మహజర్ కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి తీసికెళ్లిన సమయంలో పరారయ్యాడు. అంకుర్ ఠాకూర్ అలియాస్ రాణా పరారైన నిందితుడు. ఇటీవల కొడగులో తెలంగాణకు చెందిన రమేశ్ అనే వ్యక్తి మృతదేహాన్ని అతని రెండవ భార్య నీహారిక, ఆమె ప్రియుడు, ఇతడు కలిసి హత్య చేసి శవాన్ని 800 కిలోమీటర్ల దూంలో ఉన్న కొడగుకు వచ్చి నిర్జన ప్రదేశంలో పెట్రోల్ పోసి కాల్చివేసి పరారయ్యారు. కొడగు పోలీసులు కేసు దర్యాప్తు చేసి నీహారికతో పాటు ప్రియుడు నిఖిల్, అంకుర్ ఠాకూర్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేసారు. స్థల పరిశీలన కోసం కొడగు పోలీసులు అంకుర్ ఠాకూర్‌ను ఉప్పల్‌కు తీసికెళ్లిన సమయంలో పోలీసులను ఏమార్చి పరారయ్యాడు. దీంతో కొడగు పోలీసులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment