ఆలయం తొలగింపుపై ధర్నా
రాయచూరు రూరల్: నగరంలోని సంతోష్ నగర్‌లో నిర్మించిన ఆలయాన్ని జిల్లా పాలన, నగర సభ ఆధ్వర్యంలో పోలీసులు నేలమట్టం చేయడంతో జిల్లా బీజేపీ ఆందోళనకు దిగింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన జిల్లాధ్యక్షుడు, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ మాట్లాడారు. తొలగించిన విగ్రహాలను పోలీస్ స్టేషన్‌లో దాచడం తగదన్నారు. నగరంలో అక్రమ కట్టడాలు అనేకం ఉన్నా వాటిని తొలగించే శక్తి లేక హిందువుల ధార్మిక కట్టడాలపై అధికా రులు కన్ను వేయడం సరికాదన్నారు. అలాంటి అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకారులు మూకుమ్మడిగా జిల్లాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు. ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, శంకరప్ప, ఆంజనేయ, రాజకుమార్, రవీంద్ర జాలదార్‌లున్నారు.
కాగా నగరంలోని సంతోష్ నగర్‌లో నిర్మించిన ఆలయాన్ని పోలీసులు మంగళవారం రాత్రి జిల్లాధికారి ఆదేశాల మేరకు నేలమట్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఇటుకలతో నిర్మించిన మందిరాన్ని జేసీబీ సహాయంతో తొలగించారు. తొలగించిన విగ్రహాలను అధికారులు వాహనంలో తరలించి భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment