అసౌకర్యాల అడ్డా రిమ్స్
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రి అసౌకర్యాలకు నిలయంగా మారింది. పేరుకు మాత్రమే ప్రభుత్వాస్పత్రి. వైద్యులు అన్ని పరీక్షలను, మందులు, మాత్రలను బయటే చేయించుకొని తీసుకురావాలని చీటీలు రాసి పంపడాన్ని రోగులు, ప్రజలు ఖండిస్తున్నారు. వైద్యులు నగరవాసులుగా అధికంగా ఉండడంతో వైద్య సేవలందిస్తున్నారు. వైద్యులంతా ప్రైవేట్ నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు నడుపుకుంటూ రిమ్స్ రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రావాలని రోగులకు సూచిస్తున్నారు. దీన్నే ఆసరాగా భావించిన ఫార్మసిస్టులు మందుల షాపుల్లో రోగులు చీటీలు ఇచ్చినా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని బయట మందుల దుకాణాల్లో తీసుకోవాలని చెబుతున్నట్లు రోగులు వాపోతున్నారు. కళాశాల ముందు వారం రోజుల నుంచి మురుగు నీరు ప్రవహించినా డీన్ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆ మురుగు నీటిలోనే కారులో ప్రయాణిస్తున్నా తనకేమీ పట్టనట్లుగా ఉండడం గమనార్హం. ఈ విషయంలో జిల్లా ఇన్‌చార్జి, వైద్య విద్యా శాఖా మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. రోగులకు కేటాయించిన వార్డులు అసౌకర్యంగా ఉన్నాయి. వార్డులను శుభ్రం చేయకుండా మరుగుదొడ్లలో పాచిక పేరుకొని రోగులు కాలు జారి కిందపడితే అడిగే నాథుడు కరువయ్యాడు.
ఆస్పత్రిలో అపరిశుభ్రత తాండవం
మౌనం దాల్చిన ప్రజాప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment