బాలలకు ప్రోత్సాహం అవసరం
బళ్లారి అర్బన్: బాలల్లోని ప్రతిభ వెలికితీతకు వారికి వివిధ రకాల శిక్షణతో పాటు పలు కార్యకలాపాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా న్యాయసేవా ప్రాధికార సభ్య కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రాజేష్ ఎన్.హొసమనె తెలిపారు. బుధవారం జెడ్పీ నజీర్ మీటింగ్ హాల్‌లో బాలలకు ఏర్పాటు చేసిన వివిధ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జెడ్పీ యోజన డైరెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ చిన్నారుల్లో వివిధ రకాలైన కళాప్రతిభ దాగి ఉంటుందన్నారు. దాన్ని అనువైన రీతిలో బయటకు తీసేందుకు కృషి చేయాలని సూచించారు. సృజనాత్మక ప్రదర్శన కళలు, శాసీ్త్రయ, జానపద నృత్యాలు, శాసీ్త్రయ, హిందూస్థానీ సంగీతం, సుగమ సంగీతం, వాయిద్య కళలైన తబల, మృదంగం, కీ బోర్డు, వేణుగానం, డోలు తదితరాలతో పాటు చిత్రలేఖనం పోటీలను దివ్యాంగులు, గిరిజన ప్రాంత పిల్లల కోసం నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా హనుమంత , పల్లవి, వీణ, గంగన్న తదితరులు వ్యవహరించారు. సుమారు 135 మంది బాలలు వివిధ పోటీల్లో పాల్గొనగా విజేతలుగా గౌరీ, సుజన, ప్రభుత్వ బాలికల బాల మందిర విద్యార్థిని చైత్ర తదితర విజేతలకు ప్రముఖులు ప్రశంసా పత్రాలను అందజేశారు. సీ్త్ర శిశు సంక్షేమ అధికారి జలాలప్ప, విద్యా శాఖ విషయ పర్యవేక్షకురాలు వేదావతి, బాలల జిల్లా సంరక్షణాధికారి నాగప్ప, జిల్లా బాలల సంక్షేమ సమతి సభ్యులు మంజునాథ, గంగమ్మ, సీడీపీఓ మోహన్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment