దివ్యాంగులను ఆదరించండి
హొసపేటె: దివ్యాంగులను ఆదరించటం, వారి ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించడం ముఖ్యం, సమానత్వంతో అందరినీ కలుపుకుపోవడం ద్వారా నిజమైన సామాజిక మార్పు సాధ్యమని జిల్లాధికారి దివాకర్ అభిప్రాయపడ్డారు. జిల్లాధికారి కార్యాలయ హాలులో బుధవారం నిర్వహించిన దివ్యాంగుల కార్యక్రమాల అమలు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. దివ్యాంగుల ఆర్థిక, సామాజిక, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు ఎన్.ఆర్.ఎల్.ఎం నమోదు చేసుకుంటే సంఘాలకు అవసరమైన రుణాలు, సౌకర్యాలు అందుతాయన్నారు. రేషన్‌కార్డు లేనివారు వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రేషన్ కార్డు చేయించుకోవాలని తెలిపారు. డిసెంబర్ 3న నిర్వహించే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమాధికారి అవినాష్ తెలిపారు. అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ సలీం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment