ఆకుపచ్చగా డ్యాం నీరు
హొసపేటె: తుంగభద్ర డ్యాం నీరు మళ్లీ పచ్చరంగులోకి మారడంతో రిజర్వాయర్‌పై ఆధారపడిన ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. కొప్పళ, విజయనగర, బళ్లారి, రాయచూరు జిల్లాల ప్రజలకు తాగు, రైతులకు సాగునీటిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు ఈ రిజర్వాయర్ నీటిని అందుకుంటున్నాయి. అయినా కూడా రిజర్వాయర్‌లోని నీరు పదేపదే పచ్చగా మారుతోంది. దీనికి మూలకారణాన్ని కనుక్కోవాల్సి ఉంది. రిజర్వాయర్ పైభాగంలో వ్యర్థాలు పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే రిజర్వాయర్‌కు సంబంధించిన వ్యర్థాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనం జరగలేదు. 33 గేట్లను మార్చాలని నిపుణులు ఇప్పటికే ప్రభుత్వాలకు నివేదించారు. కాగా రిజర్వాయర్ నీళ్లు పచ్చగా మారాయి. కలుషిత నీరు చేరడంతో రిజర్వాయర్ నీరు పచ్చగా మారుతోందని పర్యావరణవేత్తలు అంటున్నారు. డ్యాంలో నీరు పచ్చరంగులోకి మారకుండా ఉండేందుకు మండలి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయకట్టు ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేశారు.
మేల్కొనని బోర్డు అధికారులు
ఐదు జిల్లాల ప్రజల్లో ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment