మహిళా సబలీకరణకు సర్వే చేపట్టండి
బళ్లారి అర్బన్: జిల్లాలో లింగత్వ మైనార్టీలు, మాజీ దేవదాసీ మహిళల సబలీకరణకు ప్రభుత్వ సౌకర్యాలను వారి దరిచేర్చేందుకు సర్వే ప్రక్రియ చేపట్టాలని జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా సంబంధిత అధికారులకు సూచించారు. తన కార్యాలయ సభామందిరం కిసాన్ వీడియో భవనంలో ఏర్పాటు చేసిన చేతన యోజన, లింగత్వ మైనార్టీల పునర్వసతి యోజన, మాజీ దేవదాసీ పునర్వసతి యోజన కార్యక్రమంలో జిల్లాధికారి మాట్లాడారు. సదరు వర్గాల బాగు కోసం ప్రభుత్వ పథకాలను వారికి అందించి వారిని నిస్సహాయ స్థితి నుంచి మెరుగుపడేలా కృషి చేయాలని ఆయన సూచించారు. కాగా తాలూకాల వారీగా వివరాలు.. బళ్లారి గ్రామీణ–58, బళ్లారి నగరం –449, కురుగోడు –145, కంప్లి –134, సిరుగుప్ప –167, సండూరు –117 మంది కలిపి జిల్లాలో 2007–08 సర్వే ప్రకారం మొత్తం 4,288 మంది మాజీ దేవదాసి మహిళలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 4,043 మంది మహిళలకు నెల వారిగా రూ.2వేలు చొప్పున పెన్షన్ లభిస్తోంది. మిలిగిన 245 మంది మహిళలు ఇంకా పెన్షన్ పథకానికి దరఖాస్తు చేయలేదన్నారు. నియమాల మేరకు ఈ వర్గాల అందరికీ ప్రభుత్వ వివిధ సంక్షేమ కార్యక్రమాలను అందజేసేందుకు కృషి చేయాలని జిల్లాధికారి సూచించారు. సమావేశంలో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డీడీ జలాలప్ప, సీడీపీఓ అధికారులు సౌఖ్య, బెళకు సేవా సంస్థలు, విముక్తి సంస్థ, సంఘ సంస్థలు, ప్రగతి సేవా సంస్థ, వైఆర్‌జీకే సంస్థల పదాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment