బాల చెఫ్‌లు భళా
హొసపేటె: చిన్నారులకు ఆటలంటే ఎంత ఇష్టమో వంట పరికరాలంటే అంత ఇష్టం, అమ్మ నేను వంట చేస్తా, కూరగాయలు కోస్తా అంటూ తల్లి వెంట పడతారు. దీంతో చిన్నారుల ఇష్టాన్ని గమనించిన టీబీ డ్యామ్ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో పిల్లలతో ఫైర్‌లెస్ రుచికరమైన ఆహార తయారీ ప్రదర్శనను నిర్వహించారు. వెజిటబుల్ సలాడ్, కోసంబరి, ఫ్రూట్ సలాడ్ తయారీతో పాటు తదితర రుచికరమైన వంటలను, వివిధ రకాల స్నాక్స్ తయారు చేసి ఉత్సాహంగా ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మనోర్ లాల్ మాట్లాడుతూ.. ఆహార ప్రదర్శనతో వ్యాపార పరిజ్ఞానంతో పాటు, వంట గురించి ఆచరణాత్మక పరిజ్ఞానం ఉంది. ఖాళీ సమయంలో, తల్లిదండ్రులు ఇంట్లో వంట చేసేటప్పుడు, పిల్లలకు సహాయం చేసే వైఖరి అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ప్రత్యేకంగా రూపొందించడానికి సహాయపడుతుందని కూరగాయలు, వంట పదార్థాలపై ఆసక్తి, పిల్లల ఆహార ప్రదర్శనకు తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ఉపాధ్యాయులు మీనాజ్, ఆసియ, మహేష్, ఆఫ్తాబ్, సునీత, విజయలక్ష్మి, దీపిక, సామిన, రమీజా, అంజలి పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయంలో ఫైర్‌లెస్ ఆహార పదార్థాల తయారీ
Comments
Please login to add a commentAdd a comment