అమరులారా వందనాలు
యశవంతపుర: జమ్ముకశ్మీర్‌లో మంగళవారం సాయంత్రం ఆర్మీ ట్రక్ లోయలోకి పడిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు సైనికులు అమరులయ్యారు. బాగలకోట జిల్లా రబకవి బనహట్టి తాలూకావాసి మహేశ్ మారిగోండ (25), బెళగావి తాలూకావాసి దయానంద తిరకణ్ణవర (44), కుందాపుర బీజాడికీ చెందిన అనూప్ మరణించడం తెలిసిందే. వారి భౌతికకాయాలు గురువారం ప్రత్యేక విమానంలో బెళగావికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వారి సొంతూళ్లకు తరలించారు. ఉడుపి జిల్లా కుందాపుర బీజాడికి చెందిన జవాన్ అనూప్ పూజారి (31) మృతదేహాన్ని ఉడుపి ఎంపీ కోట శ్రీనివాస పూజారి, ఇతర నేతలు ఇంటికి తీసుకొచ్చారు. అధికారులు, సైనిక అధికారులు పాల్గొన్నారు. ఇంటి దగ్గర పాఠశాలలో భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ కోడి, నేతలు వ్రద్ధాంజలి ఘటించారు. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యరు.
దేశానికి లోటు: సీఎం
సాక్షి, బళ్లారి: దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సైనికులు మృతి చెందితే దేశానికి తీరని లోటు అని, సైనికులు దేశం కోసం పనిచేసే మహానుభావులని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. బెళగావిలో సైనికుల మృతదేహాలకు ఆయన పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.
జమ్ముకశ్మీర్ నుంచి ముగ్గురు
జవాన్ల భౌతికకాయాల తరలింపు
Comments
Please login to add a commentAdd a comment