బొమ్మనహళ్లి: కొత్త ఏడాదిలో నగరవాసులకు, రాష్ట్రంలో ప్రజలపై రెండు రకాల ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. రాజధానిలో కిలోమీటర్‌కు 5 రూపాయల చొప్పున చార్జీలను పెంచాలని ఆటో డ్రైవర్‌ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో కి.మీ. 15 రూపాయలు వసూలు చేస్తున్నారు. 2021లో రేట్లు సవరించారని, తరువాత మళ్లీ పెంచలేదని, పెరిగిన నిత్యావసరాల ధరలు, ఇంధన చార్జీలతో గిట్టుబాటు కావడం లేదని ఆటోడ్రైవర్లు చెబుతున్నారు. అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని వాపోయారు. చార్జీల గురించి రవాణాశాఖతో చర్చలు జరుగుతున్నాయి.
సంక్రాంతి తరువాత పాల పొంగు
సంక్రాంతి పండుగ తరువాత సర్కారీ నందిని పాల ధర కూడా పెరగవచ్చని తెలుస్తోంది. కర్ణాటక పాల సమాఖ్య మహా మండలి సమావేశంలో లీటర్ పాలపై రూ. 5 పెంచాలని నిర్ణయించారు. కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ మాట్లాడుతూ తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని, తుది తీర్మానం ప్రభుత్వం పైన ఆధారపడి ఉందని అన్నారు. నందిని నెయ్యికి డిమాండు బాగా పెరిగిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment