జీపు, టెంపో ట్రావెలర్ ఢీ
శివమొగ్గ: జీపును టెంపో ట్రావెలర్ ఢీకొని రెండు వాహనాల్లోని పలువురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురువారం జిల్లాలోని హొసనగర తాలూకా నిట్టూరు సమీపంలోని మరకుటిగ గ్రామం వద్ద రోడ్డు మలుపులో జరిగింది. కొల్లూరు నుంచి కొడచాద్రికి వస్తున్న జీపును శివమొగ్గ నుంచి కొల్లూరు వైపు వెళుతున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని ఢీకొంది. రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. జీపులో ఉన్న ఐదుగురిలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కుందాపుర ఆస్పత్రిలో చేర్పించారు. జీపులో ఉన్న వారు కేరళకు చెందినవారుగా గుర్తించారు. టెంపో ట్రావెలర్ వాహనంలో సుమారు 10 మంది ఉండగా, వీరికి చిన్న చిన్న గాయాలయ్యాయి. హొసనగర ఆస్పత్రిలో ఔట్‌పేషెంట్లుగా చికిత్స పొందారు. హొసనగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
పలువురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment