టాయ్‌లెట్‌లో మృతశిశువు
శివమొగ్గ: పసిబిడ్డలను పుట్టగానే వదిలించుకోవడం నేటి సమాజంలో సమస్యగా మారింది. బెంగళూరులో ఓ ఆస్పత్రిలో నేపాలీ జంట ఇలాగే పుట్టిన శిశువును టాయ్‌లెట్ కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేశారు. అదే రీతిలో బుధవారం రాత్రి శివమొగ్గ నగరంలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రి ప్రసూతి వార్డు కమోడ్‌లో ఆడ శిశువు బృతదేహం కనిపించింది. ఏడో నెలలో ప్రసవమైనట్లు అంచనా వేశారు. సిబ్బంది ఒకరు రాత్రి మరుగుదొడ్డికి వెళ్లగా కమోడ్‌లో శిశువు మృతదేహం కనిపించింది. ఎవరు ప్రసవించారు, ఎవరు ఈ కృత్యానికి పాల్పడ్డారో తెలియాల్సి ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ తిమ్మప్ప తెలిపారు. ప్రసూతి వార్డులోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నాం, ఈ విషయంపై దొడ్డపేటె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఓ మహిళపై అనుమానం
బుధవారం సాయంత్రం ఆస్పత్రిలోని ప్రసూతి వార్డుకు వచ్చిన ఓ మహిళ తాను మూడు నెలల గర్భిణిని అని, ఇంటిలోనే అబార్షన్ అయిందని చెప్పి ఆస్పత్రిలో చేరింది. సదరు మహిళకు తగిన వైద్య చికిత్సను ఆస్పత్రిలో అందించారు. తరువాత ఆమె ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిపోయింది. కేస్ షీట్‌ను కూడా తీసుకెళ్లిపోయిందని, ఆమె మీదనే అనుమానం ఉందని ఆయన చెప్పారు. పోలీసులు విచారణ చేపట్టారు.
శివమొగ్గలో ఆస్పత్రిలో దారుణం
Comments
Please login to add a commentAdd a comment