ఆక్రమిత అటవీ స్థలాన్ని సర్వే చేయాలని ధర్నా
శ్రీనివాసపురం : తాలూకాలోని హసహుడ్య జిగలకుంట అటవీ ప్రాంతాన్ని ఆక్రమించిన మాజీ స్పీకర్ రమేష్‌కుమార్ భూమిని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం పదాధికారులు శనివారం పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ముందు అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించి అటవీశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ... అటవీశాఖ అధికారులు సామాన్యుల ఆక్రమణలు సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తున్నారు. అయితే మాజీ స్పీకర్ అటవీ ప్రాంతాన్ని ఆక్రమించారని పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆక్రమిత భూముల తొలగింపు విషయంలో సామాన్యులకో న్యాయం, ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ స్పీకర్ రమేష్‌కుమార్ తాలూకాలోని జిగలకుంట అటవీ ప్రాంతంలో 61 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ధర్నాలో రైతు సంఘం పదాధికారులు బంగవాది నాగరాజగౌడ, తాలూకా అధ్యక్షుడు తేర్నహళ్లి అంజినప్ప, రాజేంద్రగౌడ, ఆలవాటి శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment