హుబ్లీ: వెట్టి చాకిరీ వ్యవస్థ ఇప్పటికీ ఉందనే కఠోర వాస్తవం. ధార్వాడ కిత్తూరు మార్గంలో ఓ డాబాలో కార్మికుడిని చైన్‌తో బంధించి పని చేయించుకుంటున్న కేసు శనివారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రస్తుతం ధార్వాడ వెంకటపురలో నివసిస్తున్న కిరణ్‌కుమార్ (26), తండ్రి అరుణ్ కుమార్‌తో కలిసి ఉంటున్నాడు. ఓ డాబా యజమాని అహ్మద్ బూబుకర్ సదరు కార్మికుడిని తందూరి రోటీ చేసే పనికి పెట్టుకున్నాడు. ఈ విషయమై ఆరోపణలు రావడంతో సదరు డాబాను జిల్లా ఎస్పీ, కార్మిక శాఖ అధికారులు పరిశీలించి కేసు నమోదు చేసి కార్మికుడికి విముక్తి కల్పించారు. కార్మికుడు కిరణ్‌కుమార్ తండ్రి అరుణ్‌కుమార్ తన కుమార్తె పెళ్లి కోసం ఆ డాబా యజమాని మహమ్మద్ అబుబాకర్, అతడి మామ తైగోర ఉడకేరిలతో లక్ష అప్పు తీసుకున్నాడు. దీంతో డాబా యజమానులు గత నాలుగేళ్ల నుంచి పనికి పెట్టుకున్నారు. అయితే 20 రోజుల క్రితం కిరణ్‌కుమార్ వేరే చోటకు పనికి వెళ్తానంటు తెలుపగా ఇనుప సంకెళ్లతో కట్టివేశారు. దీనికి డాబా మేనేజర్ మంజునాథ్ ఉప్పార పని చేసే కార్మికుడు షానూరముజావర్ సహకరించారు. దీంతో ఈ నలుగురిపైన కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ గోపాలబ్యాకోడ్ తెలిపారు. కాగా కిరణ్‌కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు. కాగా సదరు డాబా యజమానులు మాట్లాడుతూ... సదరు కిరణ్‌కుమార్ తండ్రి 1996 నుంచి మా వద్ద పని చేస్తున్నాడు. కిరణ్‌కుమార్ మానసిక అస్వస్తుడు అతడు సరిగ్గా పని చేయడం లేదని ఆయన తండ్రే చెప్పడంతో తప్పించుకొని పోకుండా ఇనుప సంకెళ్లు వేశామని, అతడిని తాము బంధించలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై గరగ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment